retired IAS
-
40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ ఇదిగో
ఐటీ సెక్టార్ అనగానే లక్షల్లో జీతాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే 40 ఏళ్ల క్రితం ఐటీ కంపెనీలలో జీతాలు ఎలా ఉండేవని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'రోహిత్ కుమార్ సింగ్' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఆఫర్ లెటర్ చూస్తే.. అప్పట్లో జీతాలు ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోతారు.1984లో టీసీఎస్ కంపెనీలో జీతం రూ.1,300. అప్పట్లో ఇది రాజకుమారులు జీతం అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సింగ్, 40 సంవత్సరాల క్రితం టీసీఎస్ సంస్థలో చేరినప్పుడు తన జీతం ఇదేనని పేర్కొన్నారు.భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి సింగ్.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మొదటి ఉద్యోగమని, ఐఐటీ బనారసీ హిందూ యూనివర్సిటిలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా పొందానాని వెల్లడించారు. ఆ తరువాత అతను ముంబైలోని టీసీఎస్లోట్రైనీగా చేరారు. ప్రస్తుతం సింగ్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పట్లో జీతం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఒక నెటిజన్ ఐఏఎస్ ప్రొబేషనర్‌గా మీ ప్రారంభ జీతం ఎంత? అని అడిగిన ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ.. 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరినప్పుడు నెలకు రూ. 2200 అని వెల్లడించారు. మరొకరు ''టీసీఎస్ నుంచి సివిల్ సర్వీస్ వరకు'' నిజంగానే గొప్ప ప్రయాణం ప్రశంసించారు.A little more than 40 years ago, I got my first job at TCS Mumbai through campus recruitment at IIT BHU. With a princely salary of 1300 Rupees, the ocean view from the 11th Floor of Air India Building at Nariman Point was regal indeed! pic.twitter.com/A9akrhgu7F— Rohit Kumar Singh (@rohitksingh) September 29, 2024 -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పనిమనిషి బాగోతం .. రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి 15 లక్షల టోపీ..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఓ పెద్దమనిషి ఇంట్లో పనిమనిషి చెక్కులపై నకిలీ సంతకం చేసి రూ.15 లక్షల వరకూ నొక్కేశాడు. కోరమంగల నివాసి విశ్రాంత ఐఏఎస్ అదికారి ఎస్ఆర్.విజయ్ (84) బాధితుడు. గంగావతి కి చెందిన కాసీంసాబ్ (34)పై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ తనయుడు తన తండ్రి బాగోగులు చూసుకోవడానికి ఓ సంస్థ ద్వారా కాసీంసాబ్‌ను ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అతడు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. కాశీం ఈ నెల 21 తేదీన సోదరుని పెళ్లికి ఊరికి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. ఈ సమయంలో విజయ్ తన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా చెక్కుల ద్వారా రూ.14.90 లక్షల నగదు బదిలీ అయినట్లు తెలిసి కంగుతిన్నాడు. కాసీంసాబ్‌కు ఫోన్ చేసి విచారించగా పొంతనలేకుండా మాట్లాడాడు. దీంతో బాధితుడు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వంచకుని కోసం గాలిస్తున్నారు. చదవండి: కేర్‌టేకర్ హల్చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిమూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు చేపడుతున్నట్టుగా అధికారవర్గాల సమాచారం. కమిషనర్‌గా నియమితులైన పార్థసారథి మంగళవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నారు. ఇదీ పార్థసారథి ప్రస్థానం... 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)–ఆగ్రోనమి డిస్టింక్షన్లో పూర్తిచేశారు. 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్‌గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతల నిర్వహణ మొదలుపెట్టారు. అనంతరం అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు. 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్‌ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా బదిలీపై వెళ్లి, ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగిరెడ్డి కమిషనర్‌గా ఉండగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మెజారిటీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయినందున, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి, కార్పొరేటర్ల కాలపరిమితి వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో పాటు మార్చినెలలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాలపరిమితి కూడా ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నకిరేకల్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇప్పటికే మారగా, ఈ పంచాయతీ కాలపరిమితి త్వరలో ముగియగానే ఆ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో దాని కాలపరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా లేక 2,3నెలలు ముందుగానే ఆ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాటు ఉండడంతో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు’
సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమని రిటైర్డ్ ఐఎఎస్ ఇఎఎస్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పిన మా సలహాలు పట్టించుకోలేదన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధి ఒకేచోట జరగకూడదని చెప్పారు. పాలన ప్రజల వరుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి ఫలాలు అందరికి అందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణ జరగాలన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందనే భావన అన్ని ప్రాంతాల ప్రజలకు కలుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో మద్యపాన నిషేధం, ‘దిశ’ చట్టం వంటి నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) -
మాజీ డీజీపీ ఆనందరాం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్. ఆనందరాం (97) శుక్రవారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో కన్ను మూశారు.1950లో సివిల్ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా సేవలందించారు.ఆనందరాం రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగంలో పనిచేసి ఎన్నో కేసులు ఛేదించారు. ఆయన ఉత్తమ సేవలకు గాను 1962లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మెడల్, 1975లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 1978 –81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్‌కు సేవలందించారు. ఆయనకు 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1984లో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్‌గా ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు నియమించిన ‘సిట్’కు నాయకత్వం వహించారు. అనంతరం ఆనందరాం ‘అసాసినేషన్ ఆఫ్ ఏ ప్రైమినిస్టర్’పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. కాగా ఆనందరాం మరణ వార్త తెలిసిన వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఆనందరాం భౌతికకాయానికి శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు శ్రీకాంత్ తెలిపారు. -
నమ్మకద్రోహి చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి టోకరా వేసి ఆయన ఖాతా నుంచి రూ.63 లక్షలు కాజేసిన నమ్మక ద్రోహి అతని డ్రైవరే అని తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఫలితంగా 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి నుంచి రూ.7.15 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పి.వెంకట రమణ 2012లో అమీర్‌పేట్‌లోని దరమ్ కరమ్ రోడ్డులో నివసించే ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వద్ద డ్రైవర్/సహాయకుడిగా చేరాడు. తన భార్యతో కలిసి ఆయన ఇంటి ఆవరణలోనే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండే వాడు. రిటైర్డ్ అధికారితో పాటు ఆయన భార్య సైతం వయోవృద్ధులు కావడం, వారి సంతానం విదేశాల్లో ఉండటంతో వారు ఎక్కువగా వెంకట రమణపై ఆధారపడేవారు. ఇతడూ పక్కాగా పని చేస్తుండటంతో పూర్తిగా నమ్మారు. ఇతగాడు వీరి వద్ద పనితో పాటు క్యాబ్ డ్రైవర్‌గానూ పని చేసే వాడు. పలు పేర్లతో రుణాలు తీసుకుని మూడు కార్లు ఖరీదు చేసి క్యాబ్ సర్వీస్‌లుగా మార్చడంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు ఇచ్చాడు. వీటిలో ఓ వాహనం చోరీకి గురికావడం, మరోటి ప్రమాదానికి లోనుకావడంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం కష్టంగా మారి అవి భారంగా మారాయి. దీంతో వక్రబుద్ధి పుట్టిన వెంకట రమణ తన యజమానికే టోకరా వేయాలని నిర్ణయించుకున్నాడు. రిటైర్డ్ అధికారితో పాటు అతని భార్య పేర్లపై బల్కంపేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయింట్ ఖాతా ఉంది. చాకచక్యంగా ఈ ఖాతా ఇంటర్నెట్ బ్యాకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను సంగ్రహించాడు. ఎస్సార్‌నగర్‌లో మనీట్రాన్స్‌ఫర్ వ్యాపారం చేసే ఓ మహిళ సహకారంతో, ఆమెకు కమీషన్ ఇస్తూ యజమాని ఖాతాను యాక్సస్ చేయించాడు. గత ఏడాది ఆగస్టు నుంచి విడతల వారీగా అందులో ఉన్న రూ.63 లక్షలు కాజేశాడు. ఈ డబ్బుతో రెండు కార్లు ఖరీదు చేసుకున్నాడు. గత నెలలో బ్యాంకునకు వెళ్లి తన ఖాతా లావాదేవీలను పరిశీలించగా, గడిచిన కొన్ని రోజులుగా ఆ ఖాతాలోని సొమ్ము మాయమవుతున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆయన సైబర్ క్రైమ్ అధికారుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్, ఎస్సై జి.తిమ్మప్ప చాకచక్యంగా దర్యాప్తు చేశారు. నిందితుడు వెంకట రమణగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మిగిలిన వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. -
చంద్రబాబు సీఈఓను బెదిరించడం దారుణం
-
చంద్రబాబుకు లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్‌లు
-
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
-
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ (77) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్7లోని స్వగృహానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ ముఖ్య సలహాదారు పరకాల ప్రభాకర్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు సంజీవి ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, ఎంవీఎస్ ప్రసాద్, చెంగప్ప, రాంబాబు, ఎన్వీ భాస్కర్‌రావు, బీవీ రామారావు, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు. కేసీఆర్, చంద్రబాబు సంతాపం..: ప్రసాద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పీవీఆర్కే ప్రసాద్ సమర్థవం తమైన అధికారిగా వ్యవహరించారని, ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందిం చారని చంద్రబాబు కొనియాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారన్నారు. పీవీఆర్కే ప్రసాద్ మృతిపై జగన్ సంతాపం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ (77) మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరించారన్నారు. -
బంజారాహిల్స్‌లో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. ఇంట్లో పని చేస్తున్న వారే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
ఏపీ డీఎస్సీ-2014 అక్రమాలపై విచారణ
హైదరాబాద్: ఏపీ డీఎస్సీ-2014లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ వీఎస్ భార్గవ సభ్యులుగా ద్విసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. నెల రోజుల్లో గా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడి యా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎ స్సీ-2014 ప్రశ్నపత్రాల రూపకల్పనపైనా, ఫైనల్ ఆన్సర్ కీ రూపొందించడంపైనా అభ్యర్థుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ప్రధానంగా ప్రశ్న పత్రాలను రూపొందించడంలోనూ ఫైన ల్ కీని తయారీలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిం చడమే అక్రమాలకు కారణమని ప్రభుత్వం ని ర్ధారణకు వచ్చింది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించడం కోసం ద్విసభ్య కమిటీని నియమించింది.