
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఓ పెద్దమనిషి ఇంట్లో పనిమనిషి చెక్కులపై నకిలీ సంతకం చేసి రూ.15 లక్షల వరకూ నొక్కేశాడు. కోరమంగల నివాసి విశ్రాంత ఐఏఎస్ అదికారి ఎస్‌ఆర్.విజయ్ (84) బాధితుడు. గంగావతి కి చెందిన కాసీంసాబ్ (34)పై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ తనయుడు తన తండ్రి బాగోగులు చూసుకోవడానికి ఓ సంస్థ ద్వారా కాసీంసాబ్‌ను ఇంట్లో పనికి పెట్టుకున్నాడు.
అతడు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. కాశీం ఈ నెల 21 తేదీన సోదరుని పెళ్లికి ఊరికి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. ఈ సమయంలో విజయ్ తన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా చెక్కుల ద్వారా రూ.14.90 లక్షల నగదు బదిలీ అయినట్లు తెలిసి కంగుతిన్నాడు. కాసీంసాబ్‌కు ఫోన్ చేసి విచారించగా పొంతనలేకుండా మాట్లాడాడు. దీంతో బాధితుడు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వంచకుని కోసం గాలిస్తున్నారు.
చదవండి: కేర్‌టేకర్ హల్‌చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ
Comments
Please login to add a commentAdd a comment