బెంగళూరులో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకరైన 'బ్రెన్ కార్పొరేషన్' ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బూపేష్ రెడ్డి' ఇటీవల ఓ ఖరీదైన ఇటాలియన్ సూపర్ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఈ కారును కొన్న మొదటి వ్యక్తిగా బూపేష్ రెడ్డిగా నిలిచారు.
బూపేష్ రెడ్డి కొనుగోలు చేసిన కారు ఫెరారీ కంపెనీకి చెందిన 'పురోసాంగ్యూ' (Purosangue). దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫెరారీ పురోసాంగ్యూ మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బ్లాక్ కలర్ పొందిన ఈ కారు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. ఇంటీరియర్ గోధుమ రంగులో ఉంది. లోపలి భాగంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు.
ఫెరారీ పురోసాంగ్యూ SUV 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 10.6 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 310 కిమీ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా..
బూపేష్ రెడ్డి గ్యారేజిలో కేవలం ఫెరారీ పురోసాంగ్యూ కారు మాత్రమే కాకుండా లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ, లంబోర్ఘిని ఉరస్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్‌వీజే, లంబోర్ఘిని ముర్సిలాగో, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫెరారీ 458స్పెషలే, ఫెరారీ 296 జీటీబీ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, టెక్‌ఆర్ట్ పోర్స్చే జీటీ స్ట్రీట్ ఆర్, పోర్స్చే 911 ఆర్, పోర్స్చే 911 జీతీ2 ఆర్ఎస్, పోర్స్చే కేమాన్ జీటీ4, పోర్స్చే 911 కారెరా ఎస్, పోర్స్చే 39, పోర్స్చే 911 డీబీఎస్ కార్బన్ బ్లాక్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment