
100 కోట్ల ఫెరారీ..
ఇది ఫెరారీ 375 ప్లస్ మోడల్ రేసింగ్ కారు. వేగం గంటకు 280 కిలోమీటర్లు. 1950ల్లో ఎన్నో ప్రఖ్యాత రేసులను గెలుచుకుంది. అప్పట్లో ప్రపంచంలో అత్యుత్తమ డ్రైవర్లు మాత్రమే దీన్ని నడిపేవారట. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కారును జూన్ 27న బ్రిటన్‌లోని చిచెస్టర్‌లో వేలం వేయనున్నారు. కనీసం రూ.100 కోట్లకుపైనే పలుకుతుందని అంచనా. తద్వారా రేసింగ్ ఫెరారీ కార్ల వేలానికి సంబంధించి ఇది ప్రపంచ రికార్డును బద్దలుకొడుతుందని బొన్హామ్స్ వేలం సంస్థ ఆశిస్తోంది.