వెటెల్‌కు ‘పోల్’ నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
బుడాపెస్ట్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో రెండోసారి పోల్ పొజిషన్‌ను సాధించాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో అతను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.276 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీకే చెందిన కిమీ రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది. ఫలితంగా హంగేరి గ్రాండ్‌ప్రిలో 2004 తర్వాత మరోసారి తొలి రెండు స్థానాల నుంచి ఫెరారీ డ్రైవర్లు రేసును ఆరంభించనున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 12వ, పెరెజ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు.
నేటి ప్రధాన రేసు
సాయంత్రం గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం