టెక్సాస్: ఫార్ములావన్ చరిత్రలో బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన యూఎస్ గ్రాండ్ ప్రిలో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్.. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించాడు. తన ఫార్ములావన్ కెరీర్‌లో హామిల్టన్ వరల్డ్‌చాంపియన్‌గా నిలవడం ఆరోసారి. ఫలితంగా అర్జెంటీనాకు చెందిన జువాన్ మాన్యుల్ ఫాంగియో రికార్డును హామిల్టన్ బ్రేక్ చేశాడు.
ఫాంగియో ఐదుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలవగా ఆ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టాడు. ఒక ఆల్‌టైమ్ జాబితాలో టాప్‌లో నిలిచేందుకు హామిల్టన్ అడుగుదూరంలో ఉన్నాడు. ఫార్ములావన్‌లో అత్యధికంగా వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన జాబితాలో జర్మన్‌కు చెందిన మైకేల్ స్కూమచర్ ఉన్నాడు. స్కూమచర్ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచాడు. దాంతో హామిల్టన్ మరొకసారి చాంపియన్‌గా నిలిస్తే స్కూమచర్ సరసన నిలుస్తాడు.
యూఎస్ గ్రాండ్ ప్రి తర్వాత హామిల్టన్ 381 పాయింట్లు సాధించి ఈ సీజన్‌లో టాప్‌లో నిలిచాడు. యూఎస్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ తన రేసును రెండో స్థానంతో ముగించగా, సహచర డ్రైవర్ బొటాస్ విజయం సాధించాడు. మొత్తం 21 ఫార్ములావన్ రేసుల్లో హామిల్టన్ పదింటిని గెలుచుకున్నాడు. దాంతో ఇంకా రెండు గ్రాండ్ ప్రిలో ఉండగానే వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హామిల్టన్ గెలుచుకున్నాడు. ఇది హామిల్టన్‌కు వరుసగా మూడో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కాగా, అంతకుముందు 2008, 2014, 2015 సంవత్సరాల్లో కూడా హామిల్టన్ ప్రపంచ చాంపియన్ టైటిల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment