US Grand Prix title
-
చాంప్ వెర్స్టాపెన్
ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. ఆస్టిన్: ఫార్ములావన్ సీజన్లో ఇదివరకే చాంపియన్‌షిప్ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్ విజయం సాధించాడు. సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్లో 13వ టైటిల్ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్ లెక్లెర్క్ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (267), సెర్గెయ్ పెరెజ్ (రెడ్‌బుల్; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్లో తర్వాతి రేసు మెక్సికన్ గ్రాండ్ప్రిగా ఉంటుంది. -
US Grand Prix: వెర్స్టాపెన్ దూకుడు.. సీజన్లో ఎనిమిదో విజయం
US Grand Prix Max Verstappen Wins Race In Austin: ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎనిమిదో విజయం సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 34 నిమిషాల 36.552 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: IPL New Teams: అదానీని తలదన్నేసిన గోయెంకా గ్రూప్.. మరి సీవీసీ క్యాపిటల్ గురించి తెలుసా? ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ రెడీ That's P2 and an extra point for @LewisHamilton 👊 The Brit picked up the DHL Fastest Lap Award at @COTA, a crucial point in the intense 2021 title fight! 👀 For the full leaderboard and more >> https://t.co/sOAsD9HZK8#USGP 🇺🇸 @DHL_Motorsports #MomentsThatDeliver pic.twitter.com/79luPCBEYA — Formula 1 (@F1) October 25, 2021 -
ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా..
టెక్సాస్: ఫార్ములావన్ చరిత్రలో బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన యూఎస్ గ్రాండ్ ప్రిలో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్.. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించాడు. తన ఫార్ములావన్ కెరీర్లో హామిల్టన్ వరల్డ్‌చాంపియన్‌గా నిలవడం ఆరోసారి. ఫలితంగా అర్జెంటీనాకు చెందిన జువాన్ మాన్యుల్ ఫాంగియో రికార్డును హామిల్టన్ బ్రేక్ చేశాడు. ఫాంగియో ఐదుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలవగా ఆ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టాడు. ఒక ఆల్‌టైమ్ జాబితాలో టాప్‌లో నిలిచేందుకు హామిల్టన్ అడుగుదూరంలో ఉన్నాడు. ఫార్ములావన్‌లో అత్యధికంగా వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన జాబితాలో జర్మన్‌కు చెందిన మైకేల్ స్కూమచర్ ఉన్నాడు. స్కూమచర్ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచాడు. దాంతో హామిల్టన్ మరొకసారి చాంపియన్‌గా నిలిస్తే స్కూమచర్ సరసన నిలుస్తాడు. యూఎస్ గ్రాండ్ ప్రి తర్వాత హామిల్టన్ 381 పాయింట్లు సాధించి ఈ సీజన్లో టాప్‌లో నిలిచాడు. యూఎస్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ తన రేసును రెండో స్థానంతో ముగించగా, సహచర డ్రైవర్ బొటాస్ విజయం సాధించాడు. మొత్తం 21 ఫార్ములావన్ రేసుల్లో హామిల్టన్ పదింటిని గెలుచుకున్నాడు. దాంతో ఇంకా రెండు గ్రాండ్ ప్రిలో ఉండగానే వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హామిల్టన్ గెలుచుకున్నాడు. ఇది హామిల్టన్‌కు వరుసగా మూడో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కాగా, అంతకుముందు 2008, 2014, 2015 సంవత్సరాల్లో కూడా హామిల్టన్ ప్రపంచ చాంపియన్ టైటిల్స్ సాధించాడు. -
హామిల్టన్@ 50
యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఆస్టిన్ (అమెరికా): డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. యూఎస్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో నిర్ణీత 56 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 38 నిమిషాల 12.618 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో విజయం కాగా... కెరీర్లో 50వ టైటిల్. ఈ గెలుపుతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన డ్రైవర్స్ జాబితాలో హామిల్టన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. షుమాకర్ (91), ప్రాస్ట్ (51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తాజా విజయంతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (305 పారుుంట్లు), నికో రోస్‌బర్గ్ (331 పారుుంట్లు) మధ్య తేడా 26 పారుుంట్లకు చేరుకుంది. ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉన్నారుు. తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలోనే కొనసాగాడు. తొలి పిట్‌స్టాప్ వద్ద వెనుకబడినా ఆ వెంటనే మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్బర్గ్లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నాలుగు పారుుంట్లు పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. -
విశ్వ విజేత హామిల్టన్
1995లో... బ్రిటన్‌లో ఆటో స్పోర్ట్స్ అవార్డు ఫంక్షన్ జరుగుతోంది. ఓ పదేళ్ల పిల్లాడు మెక్లారెన్ జట్టు యజమాని దగ్గరకు వచ్చి... ‘ఏదో ఒక రోజు నేను మెక్లారెన్ తరఫున రేసులో పాల్గొంటా’ అన్నాడు. జట్టు యజమానితో పాటు పక్కన ఉన్నవాళ్లు కూడా అవాక్కయ్యారు. ఓ చిన్న పిల్లాడిలో ఏంటీ ఆత్మవిశ్వాసం అనుకున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, 2007లో అదే మెక్లారెన్ తరఫున అరంగేట్రం చేశాడు ఆ కుర్రాడు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు... ఆరేళ్ల వయసు నుంచే రేసింగ్‌ను ప్రాణంలా మార్చుకుని పడ్డ కష్టానికి ప్రతిఫలం అది. ఆ రోజు నుంచి వెనుతిరిగి చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఆ సంచలనం పేరు లూయిస్ హామిల్టన్. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించడం ద్వారా... మూడోసారి టైటిల్ గెలిచి దిగ్గజాల సరసన స్థానం సంపాదించుకున్నాడు. * మూడోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కైవసం * యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో పదో విజయం ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్... మరో మూడు రేసులు మిగిలుండగానే ప్రపంచ విజేతగా అవతరించాడు. ఈ ఏడాది పదో విజయం సాధించి... 327 పాయింట్లతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. నాటకీయ పరిణామాల మధ్య హోరాహోరీగా సాగిన యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ రేసర్ విజేతగా నిలిచాడు. సీజన్లో ఇప్పటివరకూ జరిగిన 16 రేసుల్లో తనకు ఇది పదో టైటిల్. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే 49వ ల్యాప్‌లో హామిల్టన్ దూకుడుగా వ్యవహరించి రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత చివరి వరకూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. రోస్బర్గ్కు రెండో స్థానం దక్కగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. * భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సెర్గియో పెరె జ్ ఐదోస్థానంలో నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ 35 ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రతికూల వాతావరణంలో జరిగిన ఈ రేసులో వివిధ కారణాలతో 8 మంది డ్రైవర్లు మధ్యలోనే వైదొలగడం గమనార్హం. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబరు 1న జరుగుతుంది. * ప్రస్తుతం హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో 327 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెటెల్ (251 పాయింట్లు) రెండో స్థానంలో, రోస్‌బర్గ్ (247 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థుల కంటే ఎక్కువ పాయింట్లు ఉండటంతో... తదుపరి మూడు రేసుల ఫలితాలతో సంబంధం లేకుండా హామిల్టన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైంది. ఘనతలు * అరంగేట్రం చేసిన ఏడాదే నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన ఒకే ఒక్క రేసర్ హామిల్టన్. కెరీర్ ఆరంభం నుంచి ప్రతి ఏటా హామిల్టన్ కనీసం ఒక్క రేసులో అయినా నెగ్గాడు. ప్రస్తుతం ఉన్న రేసర్లలో ఎవరికీ ఈ రికార్డు లేదు. * మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రోస్ట్ (51 టైటిల్స్) తర్వాత 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్‌తో ఎఫ్1 చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ హామిల్టన్. * మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో డ్రైవర్‌గా ఘనత. గతంలో మైకేల్ షుమాకర్ (7 సార్లు), ఫాంగియో (5 సార్లు), ప్రోస్ట్, సెబాస్టియన్ వెటెల్ (4 సార్లు) ఈ ఘనత సాధించారు. * తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... షుమాకర్ రెండుసార్లు మాత్రమే ఈ ఘనత సాధించాడు. * కెరీర్లో అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్ల జాబితాలో హామిల్టన్ (49) మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో షుమాకర్ (68), అయర్టన్ సెనా (65) ఉన్నారు. లూయిస్ హామిల్టన్‌కు ఆరేళ్ల వయసులో వాళ్ల నాన్న ఓ రిమోట్ కారు కొనిచ్చాడు. పిల్లాడు ఆడుకోవడానికే కారు అనుకున్నాడాయన. కానీ ఆ క్షణం ఆయనకూ తెలియదు తాను ఓ ప్రపంచ చాంపియన్‌కు బీజం వేశానని.. ఆ బొమ్మకారు మీద ఆసక్తితో హామిల్టన్ ప్రపంచం గర్వించదగ్గ రేసర్‌గా ఎదుగుతాడని.. 1985 జనవరి 7న ఇంగ్లండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో స్టీవెనేజ్ అనే ప్రదేశంలో హామిల్టన్ జన్మించాడు. తల్లి కార్మెన్ బ్రిటిష్ జాతీయురాలు. తండ్రి ఆంథోని కూడా బ్రిటిష్ జాతీయుడే అయినా... ఎప్పుడో వలస వచ్చిన నల్లజాతి వ్యక్తి. హామిల్టన్‌కు రెండేళ్ల వయసులో తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తనకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకూ తల్లి దగ్గర పెరిగాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లిపోయాడు. ఆరేళ్ల వయసులో తండ్రి కొనిచ్చిన రిమోట్ కారుతో రేసింగ్ మీద మక్కువ పెంచుకున్న హామిల్టన్... తర్వాత రెండేళ్లకు కార్టింగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1993లో ఎనిమిదేళ్ల వయసులో కార్టింగ్‌ను సీరియస్‌గా ప్రారంభించిన హామిల్టన్ స్వల్ప వ్యవధిలోనే క్యాడెట్ విభాగంలో చాంపియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఫార్ములా ‘ఎ’... ఫార్ములా సూపర్ ‘ఎ’... ఇంటర్ కాంటినెంటర్ ‘ఎ’ లాంటి కారు రేసుల్లో తనని తాను నిరూపించున్నాడు. 2001లో హామిల్టన్ రేసింగ్ ప్రస్థానం మొదలైంది. బ్రిటిష్ వింటర్ సీజన్ ఫార్ములాలో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఫార్ములా-3 రేసుల్లోకి వెళ్లాడు. ఏ స్థాయిలో ఏ రేసులో పాల్గొన్నా అతి తక్కువ సమయంలోనే రేసు గెలిచి సంచలనం సృష్టించేవాడు. ఫార్ములా-3 విజయంతో జీపీ-2లోకి ప్రవేశించాడు. తొలి ఏడాదే అక్కడా చాంపియన్‌గా అవతరించాడు. మెక్‌లారెన్‌తో అరంగేట్రం 2007లో 22 ఏళ్ల వయసులో హామిల్టన్ కల సాకారమైంది. మెక్లారెన్ జట్టులో రెండో రేసర్‌గా అవకాశం వచ్చింది. తన తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలిచిన హామిల్టన్... అరంగేట్రంలోనే పోడియం మీదకు వచ్చిన 13వ డ్రైవర్‌గా ఫార్ములావన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవడం ద్వారా తొలిసారి ఎఫ్1 రేసు నెగ్గాడు. ఆ తర్వాతి వారమే యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు. అదే ఏడాది ఓవరాల్‌గా సీజన్లో రెండో స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. 2008లో అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. 2009 నుంచి 2013 వరకు టాప్-3లో నిలువలేకపోయాడు. అయితే ప్రతి రేసులోనూ తన ఉనికిని మాత్రం చాటుకునే వాడు. మెక్‌లారెన్‌తో తన ప్రస్థానం 2012తో ముగిసింది. 2013 నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. 2014లో మరోసారి తన సత్తా చాటుతూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్... ఈ ఏడాది అదే టైటిల్ నిలబెట్టుకున్నాడు. సీజన్లో మరో మూడు రేసులు మిగిలుండగానే చాంపియన్‌గా అవతరించడం తన సాధికారతకు నిదర్శనం. తొలి ‘నలువు’ రేసర్ నిజానికి హామిల్టన్ బ్రిటిష్ జాతీయుడే అయినా ‘నల్ల’రేసర్ అనే ముద్ర పడింది. తండ్రిలాగే నలుపు రంగులో ఉండే హామిల్టన్‌ను ఫార్ములావన్ చరిత్రలో తొలి నల్ల జాతీయుడిగా పరిగణించారు. 2007లో తొలిసారి హామిల్టన్ వివాదంలోకి వెళ్లాడు. ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన ఏడాదే తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మీడియా బాధలు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాడు. అయితే కేవలం పన్నులు ఎగ్గొట్టడానికి ఇలాంటి నిర్ణయమంటూ బ్రిటన్ ఎంపీలు విమర్శించారు. 2007లోనే తొలిసారి నికోల్ ష్రెజింగర్ అనే సింగర్‌తో ప్రేమలో పడ్డ హామిల్టన్... ఇప్పటివరకూ ఆమెతో నాలుగుసార్లు తెగదెంపులు చేసుకున్నాడు. ఓ ఏడాది విడిపోవడం, తిరిగి మరో ఏడాది కలిసి ఉండటంలా వీళ్ల ప్రణయ ప్రయాణం సాగింది. చివరిసారిగా ఫిబ్రవరి 2015లో వీళ్లిద్దరూ విడిపోయారు. 2012లో స్విట్జర్లాండ్ నుంచి మొనాకోకు నివాసం మార్చుకున్న హామిల్టన్... ఏ దేశంలో నివసిస్తున్నా ఫార్ములావన్‌లో మాత్రం బ్రిటిష్ డ్రైవర్‌గానే కొనసాగుతున్నాడు. -సాక్షి క్రీడావిభాగం తండ్రి కష్టానికి ఫలితం హామిల్టన్‌ను రేసర్‌గా మలచడానికి అతని తండ్రి ఆంథోని ఎన్నో త్యాగాలు చేశారు. చాలా కష్టపడ్డారు. ఐటీ మేనేజర్‌గా తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో బయటకు వచ్చి కాంట్రాక్టు ఉద్యోగాలు చేశారు. ఒక దశలో రోజూ మూడు రకాల ఉద్యోగాలకూ వెళ్లేవారు. కొంతకాలానికి సొంత కంప్యూటర్ పరికరాల కంపెనీ పెట్టుకున్నారు. హామిల్టన్ రేసర్‌గా ఎదిగిన తర్వాత తన కుమారుడి వ్యవహారాలు చూసే మేనేజర్‌గా మారారు. ఫార్ములావన్ రేసర్ కావాలనే తన కుమారుడి కలను సాకారం చేయడానికి ఆ తండ్రి పడ్డ కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘‘నా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. నా విజయం కోసం పాటుపడిన జట్టు సిబ్బందికి, నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాను.’’ - హామిల్టన్