కెరీర్‌లో తొలిసారి...
హామిల్టన్‌కు స్పానిష్ గ్రాండ్‌ప్రి
సీజన్‌లో వరుసగా నాలుగో విజయం
రెండో స్థానంలో రోస్‌బర్గ్
టాప్-10లో నిలిచిన ‘ఫోర్స్’
బార్సిలోనా: ఫార్ములావన్ ప్రస్తుత సీజన్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రేసులోనూ విజయబావుటా ఎగురవేశాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి రేసును హామిల్టన్ 1 గం. 41 ని. 05.155 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారి ఈ గ్రాండ్‌ప్రిని సొంతం చేసుకున్నాడు.
హామిల్టన్ ఈ రేసుకు ముందు వరుసగా మలేసియా గ్రాండ్‌ప్రితో పాటు బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రిలను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన జోరుకు ఎదురులేదని నిరూపిస్తూ మెర్సిడెస్ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని చేర్చాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 26వ విజయం. ప్రసుత రేసులో ద్వితీయ స్థానంలో నిలిచిన రోస్‌బర్గ్.. హామిల్టన్‌కు గట్టి పోటీనిచ్చాడు.
కేవలం 0.6 సెకన్ల తేడాతో వెనకబడ్డాడు. డేనియల్ రికియార్డోకు మూడో స్థానం దక్కగా... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఫోర్స్ ఇండియా డ్రైవర్లు చైనా గ్రాండ్‌ప్రిలాగే ఇక్కడా మెరిశారు. సీజన్‌లో నాలుగోసారి ఇద్దరూ టాప్-10లో నిలిచారు. పెరెజ్ తొమ్మిదో స్థానం, హల్కెన్‌బర్గ్ పదో స్థానం దక్కించుకున్నారు. రేసులో పాల్గొన్న 22 మంది డ్రైవర్లలో కొమయషి, జీన్ ఎరిక్ వర్గిన్ మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు ఈనెల 25న మొనాకోలో జరుగనుంది.