
వేదిక మారిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గలేదు. క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఫలితంగా ఈ సీజన్ ఫార్ములావన్‌లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు.
నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే ముందుగా అతను గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేశాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు.