
సుజుకా: బ్రిటిష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో మరో ‘పోల్’ పొజిషన్ సాధించాడు. జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ అందరి కంటే వేగంగా 1 నిమిషం 27.319 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా సుజుకా సర్క్యూట్‌లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తిచేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది పదో పోల్ పొజిషన్ కాగా... జపాన్ రేసులో మొదటిది. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్ ఒకాన్ (1:29.111 సె.), పెరెజ్ (1:29.260 సె.) వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment