ఇమోలా (ఇటలీ): వరుసగా ఏడో ఏడాది కన్‌స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన ఫార్ములా వన్ (ఎఫ్1) జట్టు మెర్సిడెస్ అదరగొట్టింది. 14 ఏళ్ల తర్వాత ఎఫ్1 సీజన్‌లో పునరాగమనం చేసిన ఇమోలా రేసు ట్రాక్‌పై ఆ జట్టు డ్రైవర్లు వాల్తెరి బొటాస్, లూయిస్ హామిల్టన్ సత్తా చాటారు. ఇమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రి పేరుతో జరుగనున్న ఈ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో బొటాస్ పోల్ పొజిషన్ సాధించాడు. అతడు అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 13.609 సెకన్లలో పూర్తి చేశాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సహచరుడు హామిల్టన్ 0.097 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే రేసును లూయిస్ హామిల్టన్ లేదా వాల్తెరి బొటాస్‌లలో కనీసం ఒకరైనా ‘టాప్–4’తో ముగిస్తే.. ఎఫ్1 చరిత్రలో వరుసగా ఏడోసారి కన్‌స్ట్రక్టర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గిన తొలి జట్టుగా మెర్సిడెస్ నిలుస్తుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆరు ఎఫ్1 సీజన్‌ల్లోనూ మెర్సిడెస్ జట్టే ఈ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. గతంలో ఫెరారీ (1999–2004 మధ్య) ఇలా వరుసగా ఆరుసార్లు టీమ్ విభాగంలో టైటిల్స్‌ను నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment