ఆల్ హ్యాపీస్..!
‘పాత’నే ‘కొత్త’గా మొదలెట్టాడు ఫార్ములా వన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. సోగకళ్ల సుందరి నికోల్ స్కాజినెగర్‌తో కొంత కాలం కిందట విడిపోయిన ఇతగాడు... ‘డిన్నర్ డేట్’లో తిరిగి ఆమెతోనే కొత్త ఏడాది లైఫ్ స్టార్ట్ చేశాడు. అంతే కాదు... ఆ రాత్రి ఇద్దరూ మునుపెన్నడూ లేనంత ఆనందంగా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో గడిపారట. ఈ సంబరాన్ని హామిల్టన్ తన సామాజిక సైట్‌లో పంచుకున్నాడు. సదరు ఫొటో ఒకటి అప్‌లోడ్ చేసి... అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ కామెంట్ కూడా రాశాడు. డిసెంబర్ 31 రాత్రంతా రెడ్ వైన్‌తో మైమరిచిపోయిన ఈ జంట... జనవరి 1 సూర్యోదయాన్నీ అంతే ఉల్లాసంగా ఎంజాయ్ చేశారట.