dinner date
-
రష్మికను డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లిన విజయ్.. ఫోటోలు వైరల్
‘గీతగోవిందం’, 'డియర్ కామ్రేడ్' సినిమాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట విజయ్‌దేవరకొండ- రష్మిక మందన్నా. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో విజయ్ నటిస్తుండగా, సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న పుష్ప సినిమాలో రష్మిక నటిస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా విజయ్- రష్మిక ప్రేమలో ఉన్నారని పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ స్టార్ హోటల్లో డిన్నర్ డేట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీరిద్దరి మధ్యా ఏదో ఉందని, అందుకే షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కలుసుకోవడానికి ఒకరికొకరు టైం కేటాయిస్తున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న `మిషన్ మజ్ను` సినిమాతో రష్మిక బాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మరోవైపు లైగర్ సినిమా షూటింగ్ కోసం విజయ్ ముంబైకి వెళ్లాడు. దీంతో ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో రష్మిక ఎంతో అందమైన వైట్ ఫ్లవర్స్‌ని చేతిలో పట్టుకొని కెమెరాలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ పువ్వులు నిజంగానే రౌడీ విజయ్ ఇచ్చాడా అంటూ అప్పుడే కొందరు గాసిప్స్ అల్లేస్తున్నారు. ఏదైతేనేం ఈ ఆన్‌స్క్రీన్ జోడీ చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. క్యూట్ పెయిర్ అంటూ కదా అంటూ వీరిద్దరి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. చదవండి : ఎన్టీఆర్ సినిమా: హీరోయిన్ రేసులో రష్మిక అది విజయ్ క్రేజ్.. మరో బాలీవుడ్ భామతో రొమాన్స్ -
లవ్లీ డేట్!
కొత్త సినిమా స్టోరీ డిస్కషన్స్‌తో అఖిల్ బిజీబిజీ. వెబ్ సిరీస్ ప్రమోషన్‌తో అమల బిజీబిజీ. ఈ బిజీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త రిలీఫ్ కోసం తల్లీకొడుకులు సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ‘‘ఈ మధ్య కాలంలో నేను, అమ్మ బయటకు వెళ్లి చాలా రోజులైంది. అందుకే సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లాం. ఎప్పటిలానే నా బెస్ట్ డిన్నర్ ఇది. థ్యాంక్యూ అమ్మ. లవ్ యూ’ అంటూ క్యాప్షన్ చేసి ఈ ఫొటోను షేర్ చేశారు అఖిల్. -
టెన్నిస్ స్టార్‌తో బాలీవుడ్ భామ
లాస్ ఏంజిల్స్ : ఆమె బాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ కథానాయకి. అతను పురుషుల టెన్నిస్ నెంబర్ వన్ ప్లేయర్. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ నైట్ క్లబ్లో డిన్నర్ చేశారు. అంతే అక్కడి మీడియా ఆ జోడీపై ఓ స్టోరీ రాసింది. జోకోవిచ్ కొత్త స్నేహితురాలంటూ స్థానిక పత్రిక తన కథనంలో పేర్కొంది. అతను టెన్సిస్ సూపర్ స్టార్ జోకోవిచ్ కాగా...అమ్మడు బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకునే. అయితే ఆ కొత్త స్నేహితురాలు బాలీవుడ్ భామ దీపికా పదుకునే ను గుర్తించడంలో ఫారిన్ మీడియా కొంచెం తడబడింది. వీరిద్దరి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ మూవీ త్రిబులెక్స్ షూటింగ్లో ఉన్న దీపికా పనిలో పనిగా జొకోవిక్ ని కలిసింది. ఓ పార్టీలో టెన్నిస్ హీరోతో హుషారుగా గడిపిందట. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరూ ఒకే కారులో వెళ్లారట. ఈ డిన్నర్ డేటింగ్‌కు జోకోవిచ్ సాదాసీదాగా వచ్చినా.. మస్తానీ మాత్రం కలర్ఫుల్గా కనిపించిందని మీడియా కథనం. బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో అందర్నీ అట్రాక్ట్ చేసిందని పేర్కొంది. కాగా గతంలో టెన్నిస్ దిగ్గజాలు నాదల్, ఫెదరర్, జోకోవిక్ తో కలిసి ఢిల్లీలో జరిగిన ఒక టోర్నమెంట్ లో ఈ చిన్నది మెరిసింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఈ టోర్నమెంట్ కు దీపికా ప్రత్యేక అతిధిగా హాజరయింది. ఈ సందర్భంగా జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలినాకు కూడా డిన్నర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆల్ హ్యాపీస్..!
‘పాత’నే ‘కొత్త’గా మొదలెట్టాడు ఫార్ములా వన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. సోగకళ్ల సుందరి నికోల్ స్కాజినెగర్తో కొంత కాలం కిందట విడిపోయిన ఇతగాడు... ‘డిన్నర్ డేట్’లో తిరిగి ఆమెతోనే కొత్త ఏడాది లైఫ్ స్టార్ట్ చేశాడు. అంతే కాదు... ఆ రాత్రి ఇద్దరూ మునుపెన్నడూ లేనంత ఆనందంగా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో గడిపారట. ఈ సంబరాన్ని హామిల్టన్ తన సామాజిక సైట్లో పంచుకున్నాడు. సదరు ఫొటో ఒకటి అప్లోడ్ చేసి... అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ కామెంట్ కూడా రాశాడు. డిసెంబర్ 31 రాత్రంతా రెడ్ వైన్‌తో మైమరిచిపోయిన ఈ జంట... జనవరి 1 సూర్యోదయాన్నీ అంతే ఉల్లాసంగా ఎంజాయ్ చేశారట. -
విరాట్ కోహ్లీ రహస్య డిన్నర్...!
సాతాంప్టన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత డాషింగ్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ డిన్నర్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లోని బ్రెజిలియన్ రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి విందు ఆరగించారని బీబీసీ రేడియో ఓ కథనాన్ని వెల్లడించింది. అయితే డిన్నర్ వ్యవహారంపై అటు వాన్, ఇటు కోహ్లీల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత ఆసక్తిని రేపుతోంది. వారిద్దరి మధ్య ఇలాంటి చర్చలు జరిగాయనే అంశంపై ఊహాజనిత కథనాలు వస్తున్నాయి. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో దుమ్ము దులిపేస్తున్న కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. ఇంగ్లీష్ పిచ్ లపై స్వింగ్ బౌలింగ్ ఎదుర్కొనలేక ఇబ్బందపడుతున్న కోహ్లీ తన వైఫల్యాలను అధిగమించడానికి మాజీ కెప్టెన్ వాన్ తో ఏమైనా టిప్స్ తీసుకున్నాడా అనే కోణంలో కూడా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.