టెన్నిస్ స్టార్తో బాలీవుడ్ భామ
లాస్ ఏంజిల్స్ : ఆమె బాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ కథానాయకి. అతను పురుషుల టెన్నిస్ నెంబర్ వన్ ప్లేయర్. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ నైట్ క్లబ్‌లో డిన్నర్ చేశారు. అంతే అక్కడి మీడియా ఆ జోడీపై ఓ స్టోరీ రాసింది. జోకోవిచ్ కొత్త స్నేహితురాలంటూ స్థానిక పత్రిక తన కథనంలో పేర్కొంది. అతను టెన్సిస్ సూపర్ స్టార్ జోకోవిచ్ కాగా...అమ్మడు బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకునే. అయితే ఆ కొత్త స్నేహితురాలు బాలీవుడ్ భామ దీపికా పదుకునే ను గుర్తించడంలో ఫారిన్ మీడియా కొంచెం తడబడింది. వీరిద్దరి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
హాలీవుడ్ మూవీ త్రిబులెక్స్ షూటింగ్‌లో ఉన్న దీపికా పనిలో పనిగా జొకోవిక్ ని కలిసింది. ఓ పార్టీలో టెన్నిస్ హీరోతో హుషారుగా గడిపిందట. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరూ ఒకే కారులో వెళ్లారట. ఈ డిన్నర్ డేటింగ్‌కు జోకోవిచ్ సాదాసీదాగా వచ్చినా.. మస్తానీ మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించిందని మీడియా కథనం. బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో అందర్నీ అట్రాక్ట్ చేసిందని పేర్కొంది.
కాగా గతంలో టెన్నిస్ దిగ్గజాలు నాదల్, ఫెదరర్, జోకోవిక్ తో కలిసి ఢిల్లీలో జరిగిన ఒక టోర్నమెంట్ లో ఈ చిన్నది మెరిసింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఈ టోర్నమెంట్ కు దీపికా ప్రత్యేక అతిధిగా హాజరయింది. ఈ సందర్భంగా జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలినాకు కూడా డిన్నర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.