హామిల్టన్‌కు ఏడో ‘పోల్'
నేడు రష్యా గ్రాండ్‌ప్రి
సోచి (రష్యా): మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 38.513 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
రోస్‌బర్గ్ (మెర్సిడెస్), బొటాస్ (విలియమ్స్), బటన్ (మెక్‌లారెన్), క్వియాట్ (ఎస్టీఆర్), రికియార్డో (రెడ్‌బుల్), అలోన్సో (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), వెటెల్ (రెడ్‌బుల్), మాగ్నుసన్ (మెక్‌లారెన్), పెరెజ్ (ఫోర్స్ ఇండియా), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), గ్రోస్యెన్ (లోటస్), ఎరిక్సన్ (కాటర్‌హమ్), హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), మసా (విలియమ్స్), కొబయాషి (కాటర్‌హమ్), మల్డొనాడో (లోటస్), చిల్టన్ (మారుసియా) వరుసగా 2 మొదలుకొని 21వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.