
'ఆ నిర్ణయం ఆశ్చర్యపరచలేదు'
సహచర ఫార్ములావన్ డ్రైవర్, ఎఫ్1 విశ్వవిజేత నికో రోస్ బర్గ్ వీడ్కోలు నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ తనను పెద్దగా ఆశ్చర్యపరచలేదని బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పష్టం చేశాడు.
వియన్నా:సహచర ఫార్ములావన్ డ్రైవర్, ఎఫ్1 విశ్వవిజేత నికో రోస్ బర్గ్ వీడ్కోలు నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ తనను పెద్దగా ఆశ్చర్యపరచలేదని బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం నుంచి అతను ఫార్ములావన్ రేసులో ఉన్న విషయం తనకు తెలుసని, అందుచేత ఆ ఆకస్మిక నిర్ణయం తనను ఆశ్చర్యపరచకపోవడానికి కారణం కావొచ్చన్నాడు.
అయితే వచ్చే ఏడాది తమతో పాటు రోస్ బర్గ్ రేసులో పాల్గొనడం లేదనే ఒక్క విషయం మాత్రం బాధిస్తుందన్నాడు.కచ్చితంగా రోస్ బర్గ్ ను మిస్ అవుతున్నామన్న హామిల్టన్.. అతను భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఫార్ములావన్కు గుడ్ బై చెప్పుంటాడని అనుకుంటున్నట్లు హామిల్టన్ అన్నాడు. ఫార్ములావన్లో ఉండాలంటే ఎక్కువ సమయం ఆ క్రీడకే కేటాయించక తప్పదనే విషయం అంగీకరించక తప్పదన్నాడు.