రేసింగ్‌ పాయింట్‌ జట్టుపై రూ. 3 కోట్ల జరిమానా | Racing Point Team Gets Rs 3 Crore Fine | Sakshi
Sakshi News home page

రేసింగ్‌ పాయింట్‌ జట్టుపై రూ. 3 కోట్ల జరిమానా

Published Sat, Aug 8 2020 8:29 AM | Last Updated on Sat, Aug 8 2020 8:35 AM

Racing Point Team Gets Rs 3 Crore Fine - Sakshi

సిల్వర్‌స్టోన్‌: నిబంధనలకు విరుద్ధంగా... ప్రత్యర్థి కారుతో పోలి ఉన్న పరికరాలను వాడుతూ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో పోటీపడుతున్న రేసింగ్‌ పాయింట్‌ జట్టుపై అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) 4 లక్షల యూరోలు (రూ. 3 కోట్ల 54 లక్షలు) జరిమానా విధించింది. దాంతోపాటు కన్‌స్ట్రకర్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆ జట్టు ఖాతాలో నుంచి 15 పాయింట్లు తొలగించింది.

ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్, అతని సహచరుడు వాల్తెరి బొటాస్‌ సభ్యులుగా ఉన్న మెర్సిడెస్‌ జట్టు వాడుతున్న బ్రేక్‌ డక్ట్‌లను రేసింగ్‌ పాయింట్‌ జట్టు గత మూడు రేసుల్లో వాడిందని రెనౌ జట్టు స్టీవార్డ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై  విచారించిన స్టీవార్డ్స్‌ రెనౌ ఫిర్యాదులో నిజం ఉందని తేలుస్తూ రేసింగ్‌ పాయింట్‌ జట్టును హెచ్చరించి జరిమానా విధించడంతోపాటు పాయింట్లను తీసివేసింది. ప్రస్తుత ఫార్ములావన్‌ సీజన్‌లో నాలుగు రేసులు ముగిశాక కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌ విభాగంలో రేసింగ్‌ పాయింట్‌ జట్టు 42 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా... 10 పాయింట్లతో రెనౌ జట్టు ఆరో స్థానంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement