
మోంజా (ఇటలీ): పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు చుక్కెదురైంది. ఊహించని విధంగా అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్స్) విజేతగా అవతరించాడు. 53 ల్యాప్‌ల రేసును 10వ స్థానం నుంచి ప్రారంభించిన 24 ఏళ్ల గాస్లీ గంటా 47 నిమిషాల 06.056 సెకన్లలో రేసుని ముగించి తన కెరీర్‌లో తొలి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించాడు. తద్వారా 1996లో ఒలివర్ పానిస్ (మొనాకో గ్రాండ్‌ప్రి) తర్వాత ఎఫ్1 రేసులో టైటిల్ గెలిచిన తొలి ఫ్రాన్స్ డ్రైవర్‌గా గాస్లీ గుర్తింపు పొందాడు. కార్లోస్ సెయింజ్ (మెక్‌లారెన్) రెండో స్థానాన్ని, లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) మూడో స్థానాన్ని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment