
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్ హీరోయిన్. స్ట్రీట్ డాగ్ సమర్పణలో లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం నిర్మించారు. ఆగస్టు 18న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. హీరో–దర్శక–నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ– ‘‘మహిళల ఆత్మగౌరవం కథాంశంగా చేసుకుని అల్లిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘నచ్చినవాడు’’ అన్నారు.
హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ "నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.
నటి లలిత నాయక్ మాట్లాడుతూ ‘నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment