Actor Varun Tej And Lavanya Tripathi Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Tripathi Love Story: ఆ మూవీతో ప్రేమలో.. సీక్రెట్‌గా డేటింగ్‌..వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీ

Published Fri, Jun 9 2023 6:16 PM | Last Updated on Fri, Jun 9 2023 6:39 PM

Varun Tej, Lavanya Tripathi Love Story - Sakshi

మెగా ఇంట మరో ప్రేమ వివాహం జరగబోతుంది. మెగా బ్రదర్‌ నాగబాబు ఏకైక తనయుడు, హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లవాణ్య త్రిపాఠి త్వరలోనే ఒక్కటవ్వబోతున్నారు. ఈ రోజు(జూన్‌ 9) వీరిద్దరి నిశ్చితార్థం జరుగుతోంది. సాధారణంగా సినీ సెలెబ్రెటీలు ప్రేమలో ఉంటే ఆ విషయం త్వరగానే జనాలకు తెలిసిపోతుంది. కానీ వరుణ్‌, లావణ్యల విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించినా.. ఎవరూ స్పందించకపోవడంతో అందులో వాస్తవం లేదనుకున్నారు. అయితే ఆ పుకార్లు కూడా ఆలస్యంగానే వినిపించాయి.

వాస్తవానికి 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్‌’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు.

(చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె)

వీరిద్దరు కలిసి నటించిన రెండో సినిమా ‘అంతరిక్షం’ సమయంలో ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. అయినా కూడా ఇరువురు స్పందించలేదు. ఇక నిహారిక పెళ్లి (2020లో) సమయంలో మెగా ఇంట లావణ్య చేసిన సందడి చూసి నిజంగానే వరుణ్‌, లావణ్య ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. పలు వెబ్‌సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య కానీ స్పందించలేదు.

దీంతో ఇదంతా ఒట్టి పుకారే అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం డేట్‌ అనౌన్స్‌ చేసి షాకిచ్చారు. లావణ్య దగ్గరు వరుణ్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టగా.. అమె వెంటనే ఓకే చెప్పేసిందట. మెగా ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో వరుణ్‌ తేజ్‌, లావణ్యల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement