Kantara Movie Actor Rishab Shetty Love Story In Telugu Goes Viral - Sakshi
Sakshi News home page

Rishab Shetty Love Story: ఈవెంట్‌లో చూసి.. ఫేస్‌బుక్‌లో చాటింగ్‌.. ‘కాంతార’ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ప్రేమ కహానీ

Oct 27 2022 12:51 PM | Updated on Oct 27 2022 1:31 PM

Kantara Movie Actor Rishab Shetty Love Story In Telugu Goes Viral - Sakshi

‘కాంతార’... చిన్న చిత్రంగా విడుదలైన ఈ కన్నడ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100‍ కోట్లకు పైగా వసూళ్ల రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచ వాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ సినిమా హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరు రిషబ్‌ శెట్టి గురించి ఆరా తీస్తున్నారు. ఆయన బ్యాగ్రౌండ్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్‌ శెట్టి లవ్‌స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Kantara Actor Rishab Shetty Love Story In Telugu

ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం
రిషబ్‌ శెట్టిది ప్రేమ వివాహం. 2016లో రిషబ్‌ శెట్టి  కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారట. ఆ కార్యక్రమానికి రక్షిత్‌ శెట్టి వీరాభిమాని ప్రగతి కూడా వెళ్లిందట. అక్కడే ప్రగతిని చూశాడట రిషబ్‌. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడట. ఆమె గురించే ఆలోచిస్తూ.. ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేశాడట. అందులో ఆమె ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ కనిపించిందట. దాదాపు ఏడాది క్రితమే రిషబ్‌కి ప్రగతి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టిందట.

కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదట. ఈవెంట్‌లో చూశాక.. ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేశాడట.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాటింగ్‌, ఫోన్‌కాల్స్ మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం..పెళ్లివరకు వెళ్లడం జరిగిపోయింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు ప్రగతి కుటుంబ సభ్యులు. 

Actor Rishab Shetty Marriage Story In Telugu

ఈ పెళ్లికి మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. రిషబ్‌ది సినిమా బ్యాగ్రౌండ్‌ కావడం, పెద్దగా సెటిల్డ్‌ కాలేదనే ఉద్దేశంలో పెళ్లికి నిరాకరించారట. కానీ ప్రగతి పట్టుబట్టి ఇంట్లో వాళ్లని ఒప్పించిందట. 2017లో రిషబ్‌, ప్రగతి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

Rishab Shetty And Wife Pragati Shetty Photos

రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్‌లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement