దృశ్యం 2: కేసు రీఓపెన్‌ చేయనున్న రానా! | Drishyam 2 Telugu Remake: Rana Daggubati Will Reopen Case | Sakshi
Sakshi News home page

బాబాయ్‌తో కలిసి నటించనున్న రానా!

Published Tue, Mar 9 2021 9:06 AM | Last Updated on Tue, Mar 9 2021 11:54 AM

Drishyam 2 Telugu Remake: Rana Daggubati Will Reopen Case - Sakshi

రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో వెంకటేశ్‌ ‘బళ్లారి బావ..’ పాటలో కనిపించారు. ఇప్పుడు ఈ బాబాయ్‌తో అబ్బాయ్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. 

‘దృశ్యం’ సినిమా చూసినవారికి కథ తెలిసే ఉంటుంది. అమ్మాయిని వేధించి, హత్యకు గురవుతాడు అబ్బాయి. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్‌ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్‌స్పెక్టర్‌ చార్జ్‌ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్‌ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌లు మొదలుపెడతాడు. రాంబాబు పాత్రలో వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో మీనా నటించిన ‘దృశ్యం’కి సీక్వెల్‌ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే.

మలయాళంలో ఆల్రెడీ ‘దృశ్యం 2’ని తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెలుగు సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్‌స్పెక్టర్‌ పాత్రను తెలుగులో రానా చేయనున్నారని టాక్‌. రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో వెంకటేశ్‌ ‘బళ్లారి బావ..’ పాటలో కనిపించారు. ఇప్పుడు ఈ బాబాయ్‌తో అబ్బాయ్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. 

చదవండి: ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement