బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ అంధాధున్. ఈ సినిమాలో ఆయుష్మాన్ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నాడు. సీనియర్ నటి టబు మరో ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏజెంట్ వినోద్, బద్లాపూర్ లాంటి థ్రిల్లర్‌లను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు.