రీమేక్‌కి రెడీ | Nithin To Remake AndhaDhun in telugu | Sakshi
Sakshi News home page

రీమేక్‌కి రెడీ

Published Thu, Nov 14 2019 1:09 AM | Last Updated on Thu, Nov 14 2019 1:09 AM

Nithin To Remake AndhaDhun in telugu - Sakshi

బాలీవుడ్‌లో గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం ‘అంధాధూన్‌’. ఆయుష్మాన్‌ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్‌  కాబోతోంది. నిర్మాత సుధాకర్‌ రెడ్డి ఈ చిత్ర రీమేక్‌ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్‌ వర్మ హ్యాండిల్‌ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్‌లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement