
బిజీ షెడ్యూల్‌లో డేట్స్ సర్దుబాటు చేయలేక సీనియర్ నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మహేష్ సరిలేరు నీకెవ్వరు నుంచి జగపతి బాబు, బన్నీ, త్రివిక్రమ్ సినిమా నుంచి రావూ రమేష్‌లు తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం.
వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు టబును తీసుకున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట. దీంతో విరాటపర్వం టీం ఆ పాత్రకు నందిత దాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment