జేజమ్మకు అమ్మ! | tabu as Anushka's Mother in Bhagmati movie | Sakshi
Sakshi News home page

జేజమ్మకు అమ్మ!

Published Tue, Jul 26 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

జేజమ్మకు అమ్మ!

జేజమ్మకు అమ్మ!

 ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కథానాయికలిప్పుడు అత్త, అమ్మ వంటి పాత్రలతో పాటు ఇతర ముఖ్యమైన క్యారెక్టర్లపైనా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, నదియా వంటి  తారలు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి  బిజీగా ఉన్నారు. ఇప్పుడా జాబితాలోకి టబు చేరారు. గడచిన రెండేళ్లల్లో హిందీలో ‘హైదర్’, ‘దృశ్యం’, ఫితూర్’ వంటి  చిత్రాల్లో కీలక పాత్రలు చేశారామె.
 
  ఇప్పుడు తెలుగులో ‘భాగమతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. అనుష్క టైటిల్ రోల్‌లో ‘పిల్ల జమిందారు’ ఫేం అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్కకు తల్లిగా టబు కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ముందు ఈ పాత్రకు నదియాను అనుకున్నారట. కానీ, టబు అయితే ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఉంటారని చిత్రబృందం ఆమెను సంప్రదించిందట.
 
 ఈ పాత్ర నచ్చడంతో టబు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగులో టబు నటించిన చివరి చిత్రం ‘పాండు రంగడు’. ఆ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లవుతోంది. ఒకవేళ ‘భాగమతి’ చిత్రాన్ని టబు అంగీకరించిన విషయం నిజమే అయితే తెలుగులో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కి ఇది నాంది అవుతుందని చెప్పొచ్చు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement