
‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్‌లో సయీదా బాయి పాత్రలో టబు ఎంత అలరించిందో తస్నీమ్ కూడా అంతే అలజడి సృష్టించింది. ఆ భూమిక పోషించిన జోయీతా దత్తా మీద వీక్షకుల దృష్టే కాదు విమర్శకుల ప్రశంసలూ పడ్డాయి. ఆ ఒక్క సిరీస్‌తోనే మోస్ట్‌వాటెండ్ యాక్ట్రెస్ అయిపోయింది. కాని జోయితానే ఆచితూచి ఎంపికచేసుకుంటోంది
వచ్చిన అవకాశాలను.
ఆమె గురించి..
- జోయితా పుట్టిపెరిగింది గువాహటి. అస్సామ్ వ్యాలీ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి డగ్రీ పట్టా తీసుకుంది.
- కాలేజ్ నుంచి బయటకు రాగానే ఓ ఏడాదిపాటు మెక్‌కిన్సేలో ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే నటన అంటే ఆసక్తి కలిగింది జోయీతాకు.
- ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్, ఎన్.కె. శర్మల థియేటర్ గ్రూప్ ‘యాక్ట్ వన్’ నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేరింది. నటనలో మెలకువలు నేర్చుకుంది.
- ఆ శిక్షణ వృథాకాలేదు. మీరా నాయర్ దర్శకత్వం వహించిన సంగీతనాటకం ‘మాన్‌సూన్ వెడ్డింగ్’లో మంచి క్యారెక్టర్ దొరికింది. అందులో జోయీతా నటించడమే కాదు, ఆడింది.. పాడింది కూడా.
- ఆ అభినయానికే మీరా నాయర్ ముచ్చటి పడి ఇదిగో ఇలా ‘ఎ సూటబుల్ బాయ్’లో తస్నీమ్‌గా ఓటీటీ వీక్షకులకు పరిచయం చేసింది. అమాయకమైన హావభావాలతో తనదైన ముద్ర వేసింది జోయీతా.
- ‘మీరా నాయర్ దర్శకత్వంలో వరుసగా నటించే చాన్స్ రావడమంటే మాటలా?
- ఆ ఆఫర్స్ వచ్చిన రోజు నా కాలు నేల మీద లేదు. ఆమె డైరెక్షన్ అంటే నాలాంటి వాళ్లకు డబుల్ బెనిఫిట్స్. పనిచేస్తూ నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది. ఇలాగే మంచి దర్శకుల దగ్గర, మంచి నటీనటులతో కలిసి పనిచేసే చాన్సెన్స్ కోసం చూస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో నా మార్క్ చూపించాలనుకుంటున్నా’ అంటుంది జోయితా దత్తా.
Comments
Please login to add a commentAdd a comment