28 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా..! | Taboo May Act With Venkatesh In De De Pyaar De remake | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా..!

Published Mon, Jun 10 2019 12:40 PM | Last Updated on Mon, Jun 10 2019 1:08 PM

Taboo May Act With Venkatesh In De De Pyaar De remake - Sakshi

విక్టరీ వెంకటేష్‌, టబు కాంబినేషన్‌లో వచ్చిన కూలీ నెం.1 చిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంతో టబు హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ ఒక్క సినిమాతో టబు క్రేజ్‌ సంపాదించుకుని బాలీవుడ్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే ఈ మధ్య టబు నటించిన అంధాదున్‌, దేదే ప్యార్‌దే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 

అజయ్‌ దేవగణ్‌తో కలిసి నటించిన ‘దేదేప్యార్‌దే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఉంది. ఈ చిత్రంలో వెంకీ సరసన టబునే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకు టబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. 1991లో వచ్చిన కూలీ నెం.1 తరువాత మళ్లీ ఇన్నేళ్లకు వీరు జంటగా నటించబోతున్నారన్నమాట. వెంకటేష్‌ ప్రస్తుతం ‘వెంకీమామ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement