
టబు
సీనియర్ యాక్టర్స్‌ను తన సినిమాల్లో కీలక పాత్రలకు తీసుకోవడం త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో నదియాను, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్రను మళ్లీ తెలుగు స్క్రీన్‌పైకి తీసుకొచ్చారు. లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో టబును నటింపజేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్ తల్లిగా ఆమె పాత్ర ఉండబోతోందని టాక్. తండ్రీ– కొడుకుల కథాంశంగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘నాన్న.. నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 2008లో బాలకృష్ణ సరసన ‘పాండురంగడు’ సినిమాలో కనిపించారు టబు. మళ్లీ పదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో కనిపించనుండటం విశేషం.