Tabu Reveals Her Beauty Secrets - Sakshi
Sakshi News home page

Tabu: రూ.50 వేలు పెట్టి ఆ క్రీమ్‌ని కొన్నా.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన టబు

Published Sun, Sep 25 2022 2:28 PM | Last Updated on Sun, Sep 25 2022 3:45 PM

Tabu Reveals Her Beauty Secrets - Sakshi

సాధారణంగా హీరో హీరోయిన్లు తన గ్లామర్‌ రహస్యాన్ని బయటపెట్టరు. అందంగా ఉండేందుకు రకరకలా ఫేస్‌ క్రీములను వాడుతుంటారు. కానీ వాటిని గోప్యంగా ఉంచుతారు. అయితే సీనియర్‌ హీరోయిన్‌ టబు మాత్రం తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ని అభిమానులతో పంచుకుంది. అందంగా ఉండేందుకు తాను ఒక్కసారి రూ.50 వేలు పెట్టి ఫేస్‌ క్రీమ్‌ కొన్నానని, ఆ తర్వాత ఇంకెప్పుడు ఫేస్‌ క్రీమ్‌ వాడలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె ఓ జాతీయ మీడియాకు  ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా  మీ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించిన యాంకర్‌కు పైవిధంగా సమాధానం చెప్పింది.

‘ఓసారి నా మెకప్‌ ఆర్టిస్ట్‌ ‘మీ అందానికి రహస్యం ఏంటి?’అని నన్ను ప్రశ్నించింది. అప్పుడు నేను ఏ సీక్రెట్‌ లేదని చెప్పాను. అయితే కొన్నాళ్ల తర్వాత నాకు ఓ ఫేస్‌క్రీమ్‌ కొనమని సలహా  ఇచ్చింది. దాని ఖరీదు రూ.50 వేలు. ఒక్కసారి మాత్రమే దానిని కొనుగోలు చేశా. ఆ తర్వాత ఎప్పుడూ ఆ క్రీమ్‌ని వాడలేదు. అందంగా ఉండేందుకు నేను ప్రత్యేకంగా ఎలాంటి క్రీములు గానీ, ఫేస్‌ వాష్‌లు గానీ చేయించను’అని టబు చెప్పుకొచ్చింది. కాగా,ఇటీవల బాలీవుడ్‌ మూవీ భూల్‌ భులయ్య-2తో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న టబు.. ప్రస్తుతం అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి ‘దృశ్యం-2’లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement