ఉపవాస దీక్షలో హీరోయిన్ | Tabu observes rozas | Sakshi
Sakshi News home page

ఉపవాస దీక్షలో హీరోయిన్

Published Sun, Jun 28 2015 11:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

ఉపవాస దీక్షలో హీరోయిన్

ఉపవాస దీక్షలో హీరోయిన్

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రముఖ నటి టబు రంజన్ నెల మొత్తం ఉపవాస దీక్ష చేస్తున్నారు. టాలీవుడ్ 'దృశ్యం' చిత్రం హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో టబు నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా టబు ఉపవాస దీక్ష చేస్తున్నారు.

 

ఒకవేళ సాయంత్రం సమయంలో విలేకర్లతో ముఖాముఖి నిర్వహించాల్సి వస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే టబు ఉపవాసం(రోజా) విరమిస్తుంది.  దృశ్యం హిందీ వెర్షన్ జులై నెలాఖరున విడుదల చేయడానికి యత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement