భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి.
అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment