అఖిల్ చిత్రంలో? | Tabu in Akhil film | Sakshi
Sakshi News home page

అఖిల్ చిత్రంలో?

Published Thu, Nov 24 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

అఖిల్ చిత్రంలో?

అఖిల్ చిత్రంలో?

‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ ‘సిసింద్రీ’ సినిమాలో నాగార్జునతో టబు హుషారుగా డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఊహే తెలియని వయసులో అఖిల్ ఆ సినిమాతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక నాగ్ సరసన టబు  ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.

ఇప్పుడు మళ్లీ అఖిల్ సినిమాలో నటించనున్నారట. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ద్వితీయ చిత్రం ఉంటుందని నాగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఉన్న ఓ కీలక పాత్ర కోసం టబూని సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement