అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ | Tabu Key Role in Akhil New Film | Sakshi
Sakshi News home page

అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

Published Thu, Nov 24 2016 11:23 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ - Sakshi

అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన ఈ యంగ్ హీరో, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రస్తుతం తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, జనవరి నుంచి కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లోనే హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తరువాత నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్కు రెడీ అవుతోంది. నాగార్జున స్వయంగా అడగటంతో టబు ఈ పాత్రకు అంగీకరించిందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement