కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్ | Tabu Key Role in Akhil New Film | Sakshi
Sakshi News home page

కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్

Published Thu, Jun 1 2017 4:43 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్ - Sakshi

కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్

తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.  మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.

తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement