
నా పాత్రలపై ఫిల్మ్ మేకర్ల అలసత్వం..
బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు.. దృశ్యం హిందీ రీమేక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు.
ముంబై:బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు.. దృశ్యం హిందీ రీమేక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంచితే తన పాత్రల ఎంపికపై టబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను విభిన్న పాత్రల్లో చూపించే విషయంలో ఫిల్మ్ మేకర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ టబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ అభిమానులు తనను ఏరకంగా చూపిస్తే బాగుంటుందనే దానిపై దర్శకులకు సరైన వర్క్ చేయడం లేదన్నారు.
తన పాత్రల ఎంపికపై దర్శకుల్లో నిబద్ధత లోపించిందని అనుకుంటున్నట్లు టబు తాజాగా పేర్కొన్నారు. తనను వివిధ పాత్రల్లో చూపించాలనుకున్నప్పుడు పక్కా విజన్ తో దర్శకులు వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. అయితే తన సినీ జీవితం బిజీగా ఉండటం పట్ల టబు ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో నలభై ఏళ్ల ఒడి ఒక అద్భుతమైనదిగా ఆమె పేర్కొన్నారు. తన జీవితం ఎన్నో అనుభవాలను నేర్పిందని ఈ సందర్భంగా పేర్కొన టబు.. ఎవరైనా అనుభవం లేకుండా రాటుదేలడం అసాధ్యమన్నారు.