టబుతో రొమాన్స్‌ సులభం: యంగ్‌ హీరో | Ishaan Khatter Said It Was Easy To Romance With Tabu | Sakshi
Sakshi News home page

టబుతో రొమాన్స్‌ సులభం: ఇషాన్‌ ఖట్టర్‌

Jan 11 2020 11:19 AM | Updated on Jan 11 2020 11:33 AM

Ishaan Khatter Said It Was Easy To Romance With Tabu - Sakshi

వేశ్య పాత్రలో టబు.. యంగ్‌ హీరోతో రొమాన్స్‌

సీనియర్‌ నటి టబుతో కలిసి రొమాన్స్‌ చేయడానికి తను ‘సూటబులే’ అంటున్నాడు ‘దఢక్‌’ హీరో ఇషాన్‌ ఖట్టర్‌‌. ఈ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఏ సూటబుల్ బాయ్‌’. ఇందులో ఇషాన్‌.. టబుతో కలిసి సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... ‘టబుతో రొమాన్స్‌ చేయడం నాకు సులభమే.. ఎందుకంటే తను టబు కాబట్టి. ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేయడంలో తనకు తానే సాటి. ముఖ్యంగా ‘ఏ సూటబుల్‌ బాయ్‌లో’ని  సైదా బాయి పాత్ర. ఇక నాకు ప్రేమికుడిగా కనిపించడం ఇష్టం. ఆ పాత్రలో నేను సులభంగా నటించగలనని ఇంతకు ముందే చెప్పాను’ అని పేర్కొన్నాడు. అంతేకాదు టబుకు ‘తబాస్కో’ అనే ముద్దు పేరును పెట్టినట్లు వెల్లడించాడు.

అలాగే టబును మిర్చితో కూడా పోల్చాడు ఇషాన్‌ ఖట్టర్‌. ఈ క్రమంలో టబుకు ఏ బహుమతిని ఇస్తారు అని అడగ్గా.. ‘తనకు నా హృదయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అంతేకాదు గాలిబ్‌ కవిత పుస్తకాన్ని కూడా తనకు బహుమతిగా ఇస్తాను’ అంటూ సమాధానం చెప్పాడు. ఇక మీరా నాయర్‌ దర్శకత్వంలో వస్తున్న..ఏ సూటెబుల్‌ బాయ్‌లో ఇషాన్‌ రాజకీయ నాయకుడు మహేష్‌ కపూర్‌ కుమారుడు మాన్‌ కపూర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కాగా మాన్‌కపూర్‌(ఇషాన్‌ ఖట్టర్‌) ఓ అందమైన వేశ్యకు ఆకర్షితుడై తండ్రికి ఎదురు తిరిగే కుమారుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో వేశ్య సైదా బాయ్‌ పాత్రలో టబు కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement