
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ, తెలుగు నటి టబు.

టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. ఈరోజు(నవంబర్ 04) ఈమె పుట్టినరోజు.

ఈమెకు మూడేళ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో తల్లి దగ్గరే పెరిగింది.

10 ఏళ్ల వయసులోనే 1982లో 'జబార్' రిలీజైన సినిమాతో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసింది.

ముఖ్యంగా నాగార్జున- టబు జోడీది సక్సెస్ ఫుల్ కాంబినేషన్.

కూలీ నెంబర్ 1, నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి, ఆవిడా మా ఆవిడే, అందరివాడు తదితర తెలుగు చిత్రాల్లో నటించింది.

ఆ మధ్యన 'అల వైకుంఠపురం' సినిమాలో అల్లు అర్జున్ తల్లిగానూ మెప్పించింది.

'ప్రేమ్' సినిమా షూటింగ్ టైంలో ఇందులో హీరోగా నటిస్తున్న సంజయ్ కపూర్‌తో ప్రేమలో పడింది. కానీ ఇది పెళ్లివరకు వెళ్లలేదు.

బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాతోనూ టబు డేటింగ్ చేసింది. కానీ ఈ బంధం ఎక్కువకాలం నిలవలేదు.

ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్.. ఇలా ఈమెకు 100కి పైగా ముద్దుపేర్లు ఉండటం విశేషం.

సల్మాన్ ఖాన్-కృష్ణజింకల్ని కాల్చినప్పుడు ఈమె కూడా అతడి పక్కనే ఉంది. కాకపోతే ఈ కేసులో ఈమెని నిర్దోషిగా తేల్చారు.

ఇప్పుడు 54వ పుట్టినరోజు జరుపుకొంటోంది. ఇన్నేళ్లయినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ ట్రెండ్‌కి తగ్గట్లే దూసుకుపోతోంది.






