అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ జెన్‌ప్యాక్ట్ ప్రెసిడెంట్, సీఈవో ‘టైగర్’ త్యాగరాజన్ రిటైర్ కాబోతున్నారు. త్యాగరాజన్ 2024 ఫిబ్రవరి 9న రిటైర్ కాబోతున్నట్లు జెన్‌ప్యాక్ట్ ప్రకటించింది. తదుపరి సీఈవోగా బాలక్రిషన్ (బీకే) కల్రాను నియమిస్తున్నట్లు పేర్కొంది.
త్యాగరాజన్ అసలు పేరు ఎన్‌వీ త్యాగరాజన్. ఈ పేరును సంక్షిప్తం చేసి స్నేహితులు ఆయన్ను టైగర్ అని పిలిచేవారు. దీంతో ఆయనకు ‘టైగర్’ త్యాగరాజన్ అనే పేరు స్థిరపడింది. 2011లో జెన్‌ప్యాక్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన త్యాగరాజన్ 2022 నాటికి ఆ కంపెనీని 4.3 బిలియన్ డాలర్ల ఆదాయంతో అగ్రగామిగా తీర్చిదిద్దారు. ‘టైగర్’ త్యాగరాజన్ డేటా అండ్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి క్లయింట్‌లకు మెరుగైన సేవలందించారని జెన్‌ప్యాక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘టైగర్’ త్యాగరాజన్ తర్వాత ఎవరిని సీఈవో చేయాలనే దానిపై జెన్‌ప్యాక్ట్ చాలా పెద్ద కసరత్తు చేసింది. కంపెనీలో ఉన్నవారితోపాటు పలువురు బయట వ్యక్తులను పరిశీలించిన కంపెనీ చివరకు అదే కంపెనీలో పలు కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్న బీకే కల్రాను తదుపరి సీఈవోగా నియమించింది. ఈయన 1999లో జెన్‌ప్యాక్ట్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment