రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు (Happy Birthday to Nita Ambani ) జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా అంబానీ పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ లాంటి అనేక అంశాల్లో నీతా అంబానీ తనదైన శైలిలో సేవలందించి లక్షలాదిమందికి దగ్గరయ్యారు.

Warmest birthday wishes to our Founder and Chairperson, Mrs. Nita Mukesh Ambani. pic.twitter.com/mK2hdQQ8eU
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2025
అంతేకాదు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమానిగా జట్టు విజయవంతంగా నడిపించిన ఘనత ఆమె సొంతం. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ ద్వారా, కళలకు, దేశీయ వస్త్రాలకు ఎంతో ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికైన తొలి భారతీయురాలు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు.

నీతా అంబానీ 62వ పుట్టిన రోజు (నవంబరు 1)అనేక మంది ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, ఎన్‌ఎంఏసీసీ కూడా నీతా అంబానీ ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ అందించాయి.


