ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోట్ల రూపాయల కొత్త కారు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల కోటి రూపాయలు పెట్టి, పెయింటింగ్,ఇ తర మార్పులు చేసిన ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు రోల్స్ రాయిస్ కెమెరాకు చిక్కింది. (టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!)
ఇటీవల కోటి రూపాయలకుపైగా ఖర్చుపెట్టి మరీ పెయింటింగ్ వేయించిన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ కెమెరాకు చిక్కింది. ఇక ఇన్‌స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. ర్యాప్ షేడ్స్‌లైట్స్ మారుతున్న తీరు విశేషంగా నిలిచింది. అయితే నిజంగా ఇది రంగులు మార్చడం కాదు. సైకెడెలిక్ ర్యాప్ వివిధ షేడ్స్ లైట్ల క్రింద వివిధ రంగులను రిప్లెక్ట్ చేస్తుంది. అలా ఈ కారు రంగులు మారుతున్న భ్రమను మనకు కలిగిస్తుందన్న మాట.
అంబానీ సొంతమైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభం. అయితే మీడియా నివేదికల ప్రకారంకోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ కారణంగా దీని ధర రూ.13.14 కోట్లకు పెరిగిందన్నట్టు. అంతేకాదు దీని రిజిస్ట్రేషన్ నంబర్ '0001' కోసం రూ. 12 లక్షలు చెల్లించారట. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా)
కాగా అంబానీ లగ్జరీ నివాసం ముంబైలోని రూ. 15,000 యాంటిలియా, రూ. 850 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌తో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాండ్ రోవర్, లంబోర్ఘిని ఫెరారీ లాంటి టాప్ కార్లు అంబానీ కుటుంబం సొంతం.
Comments
Please login to add a commentAdd a comment