ఆసియాలోనే అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏప్రిల్ 19, 1957న యెమెన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర సంపద విలువ 84.1 బిలియన్ డాలర్లు. అంటే రూ.69 లక్షల కోట్లకుపైగానే.
ముఖేష్ అంబానీ 1981లో తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చి విస్తరించారు. 1985లో నీతాను వివాహమాడారు. వీరి ముగ్గరు పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీతోపాటు భార్య నీతా, వారి పిల్లలు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు శ్రమిస్తున్నారు.
వ్యాపారంలోకి రాక ముందు తాను ఏం అవ్వాలనుకున్నారో ముఖేష్ అంబానీ ఒకసారి బయటపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చేరమని తన తండ్రి అడగకముందు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకున్నానని వెల్లడించారు. వివాహం తర్వాత భార్య నీతా అంబానీ కూడా దీన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. ఎందుకంటే వివాహానికి ముందు ఆమె కూడా టీచరే. అది వీలు పడకపోయినప్పటికీ తమ సంతృప్తి కోసం విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
Comments
Please login to add a commentAdd a comment