
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మరో విదేశీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నరియాకు చెందిన చెందిన సెన్స్‌హాక్‌లో 79.4 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనికి విలు32 మిలియన్ డాలర్లు.సెన్స్‌హాక్ ఇంక్. (సెన్స్‌హాక్)తో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్ మంగళవారం ప్రకటించింది.
కాలిఫోర్నియాకు చెందిన సెన్స్‌హాక్, 2018లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్‌వేర్ బేస్డ్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ను అందించే సంస్థ. ఆటోమేషన్‌ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టు ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, ఎండ్-టు-ఎండ్ సోలార్ అసెట్ లైఫ్‌సైకిల్‌ను నిర్వహించేలా నిరంతరమైన సేవలందించే సోలార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది.
గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాయని రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 GW సౌరశక్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. సెన్స్‌హాక్ సహకారంతో ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుతామన్నారు. అలాగే రిలయన్స్ మద్దతుతోసెన్స్‌హాక్ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ డీల్‌పై సెన్స్‌హాక్ ఫౌండర్ సీఈవో స్వరూప్ మావనూర్, ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ సాంఖే సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment