న్యూఢిల్లీ: దివాలా చట్ట చర్యలలో ఉన్న సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణ పరిష్కార ప్రణాళిక(రిజల్యూషన్) తుది దశకు చేరింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)సహా నాలుగు కంపెనీలు సవరించిన బిడ్స్‌ను దాఖలు చేశాయి. వీటిని రుణదాతల కమిటీ(సీవోసీ) పరిశీలించనుంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న టెక్స్‌టైల్స్ కంపెనీ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి అసెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్‌తో జత కట్టిన ఆర్‌ఐఎల్ రూ. 2,800 కోట్ల విలువలో బిడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఈజీగో టెక్స్‌టైల్స్(వెల్‌స్పన్ గ్రూప్), జీహెచ్‌సీఎల్, హిమంత్‌సింగ్‌కా వెంచర్స్ సైతం బిడ్స్‌ను దాఖలు చేసినట్లు గత వారమే సింటెక్స్ వెల్లడించింది. సవరించిన బిడ్స్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ సమీక్షించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment