రిలయన్స్ ఇండస్ట్రీ 46వ ఏజీఎం సోమవారం జరిగింది. ఈ సందర్బంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీరిలయన్స్ గ్రూప్,వాటాదారులను ఉద్దేశించి అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే రిలయన్స్ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక ప్రకటన చేశారు. అలేగే సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాటాదారులు, ఉద్యోగులక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బోర్డులో కీలకమార్పులను ప్రకటించారు. అంబానీ తన భార్య నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. అలాగే ఇషా,అనంత్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
రిలయన్స్ జియో స్మార్ట్ హోమ్ సేవలను ప్రకటించింది. ఆటోమేట్, రిమోట్ యాక్సెస్‌ని అనుమతించే ఆధునిక పరికరాల కలయిక.. యాప్‌లు, రిమోట్‌లు, స్విచ్‌లు, వాయిస్ కమాండ్‌లు లేదా కృత్రిమ మేధస్సు ద్వారా ఈ సేవలను నియంత్రించనుంది.
రిలయన్స్ గత 10 సంవత్సరాలలో 150 బిలియన్ల డాలర్లకుపైగా పైగా పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. తమ అన్ని వ్యాపారాలలో 2.6 లక్షల ఉద్యోగాలను సృష్టించిందనీ, ఇందులో 3.9 లక్షల మంది తమ ఉద్యోగులు ఉన్నారని అంబానీ ప్రకటించారు. తమ గ్రోత్‌కు సహకరించిన వాటాదారులకు, ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
⇒ ఇది ఆత్మవిశ్వాసం నిండిన నవ భారతం
⇒ రిలయన్స్ అభివృద్ధి చెందుతున్న కొత్త భారతదేశానికి నాందిగా నిలిచింది
⇒ మేం అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, అంతేకాదు వాటిని సాధించాం
⇒ జియో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
⇒ తొమ్మిదినెలలో 96 శాతం 5జీ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది డిసెంబరునాటికి దేశ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం.
⇒ వోల్టాయిక్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్స్ కోసం నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. జామ్‌నగర్‌లో పూర్తిగా సమీకృత న్యూ ఎనర్జీ తయారీ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పేందుకు కంపెనీ రూ. 75,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అంబానీ చెప్పారు.
⇒ jio AirFiber సెప్టెంబర్ 19 న గణేష్ చతుర్థి సందర్భంగా ప్రారంభించనున్నట్టు అంబానీ ప్రకటించారు.
⇒ జియో మార్ట్ , వాట్సాప్‌ల ప్రారంభం అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2022లో ప్రారంభించినప్పటి నుండి వాట్సాప్‌లో జియో మార్ట్ వినియోగదారుల సంఖ్య 9 రెట్లు పెరిగింది: ఇషా అంబానీ
⇒జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా రంగొంలో సులభమైన , స్మార్ట్ బీమా ఉత్పత్తులను అంతరాయం లేని డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందించడానికి బీమా విభాగంలోకి ప్రవేశిస్తుందని రిలయన్స్ చైర్మన్ ప్రకటించారు.
⇒జియో వృద్ధికి అత్యంత ఉత్తేజకరమైన సరిహద్దుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ప్రస్తావించిన ఆయన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను వివరించారు.క్లౌడ్ అండ్ ఎడ్జ్ లొకేషన్‌లలో 2,000 మెగావాట్ల వరకు AI-రెడీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సృష్టించేందుకు కంపెనీ నిబద్ధతను అంబానీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment