సాక్షి, హైదరాబాద్: ప్రపంచ చిరునవ్వు దినోత్సవం ప్రతి సంవత్సరం, అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటాం. ఈ స్మైల్ డేను తొలిసారిగా 1999లో అమెరికన్ ఆర్టిస్ట్ హార్వే బాల్ ప్రారంభించారు. నవ్వుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేయడంమే దీని ఉద్దేశం. పని ఒత్తిడినుంచి మన బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఓ చక్కటి చిరునవ్వు చాలు.
శరీరంలో అనేక చక్కటి మార్పులకు శ్రీకారం చుడుతుంది చిరునవ్వు. ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండె కదలికలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనతోపాటు, మనచుట్టూ ఉన్నవారిని కూడా సంతోషకరంగా ఉండేలా చేస్తుంది. నగుమోముతో ఉంటే మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఎందుకంటే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు కాబట్టి.
నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, ఫ్లూనుంచి సులువుగా బయటపడవచ్చు, అంతేనా సహజమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. నవ్వినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి. సెరోటోనిన్ సహజమైన యాంటీడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా మన మానసిక స్థితిని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచేలా దోహదపడుతుంది. నవ్వడం వలన సగటున కనీసం 3 సంవత్సరాల వయసు తగ్గి, మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. చిరునవ్వులు చిందిస్తూ.. హాయిగా జీవిద్దాం!
Comments
Please login to add a commentAdd a comment