మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు
ఇబ్రహీంపట్నం: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి యువతే అమూల్యమైన శక్తిసంపదలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగరరావు చెప్పారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో శుక్రవారం నోవా ఫార్మసీ కళాశాల అదనపు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యాసాగరరావు మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు తమ మేథాశక్తిని దేశానికి వినియోగించాలని కోరారు.
ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇండియా అన్నట్లుగానే మేక్ విజయవాడ నినాదంతో అభివృద్ధి పథంలో ముందుండాలన్నారు. ప్రపంచ దేశాలను శాసిస్తున్న రాజకీయాల్లో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల, కళాశాల కరస్పాండెంట్ ఎం.కృష్ణారావు, డెరైక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
యువతే దేశ సంపద
Published Sat, Mar 14 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement