
సాక్షి, ముంబయి : కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాల్లో బతుకు రోజురోజుకూ దుర్భరమవుతుంటే మండుతున్న ధరలు సిటిజనులకు చుక్కలు చూపుతున్నాయి. భారత నగరాల్లో సైతం బడుగు జీవి బతికే పరిస్థితి లేదు. ప్రపంచంలోని 20 అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి 16వ స్ధానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ వెల్లడించిన ఈ నివేదికలో మొనాకో అత్యంత ఖరీదైన నగరంలో టాప్‌ప్లేస్‌లో ఉంది.
హాంకాంగ్, న్యూయార్క్, లండన్, సింగపూర్‌లు టాప్ 10 ఖరీదైన నగరాల జాబితాలో నిలిచాయి. సంపద, పెట్టుబడులు, జీవన శైలి, భవిష్యత్ అవకాశాల వంటి అంశాల ప్రాతిపదికన అత్యంత ఖరీదైన నగరాలను ఈ సంస్థ ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment