Russian businessman Offered To Putin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యాను వీడి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. యుద్ధ నేరస్తుడిగా పుతిన్‌ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా సరే వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ప్రకటిస్తానంటూ సైన్యానికి ఆఫర్ చేశాడు. ఫేస్‌బుక్ వేదికగా ఆయన ఈ బహిరంగ ప్రకటన చేయడం విశేషం.
రష్యాకు చెందిన కొనానిఖిన్ అమెరికాలో పలు వ్యాపారాల్లో ఆరితేరాడు. పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో ఇన్వెస్టర్‌గా ఆయన చాలా ఫేమస్. అతని సంపద విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా అతను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి వ్యతిరేకంగా గళం విప్పాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్నాడు
ఫేస్‌బుక్‌లో కొనానిఖిన్ చేసిన పోస్టులో... పుతిన్ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని చేసుకున్నాడు. అకారణంగా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడు. ఒక రష్యన్ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే యుద్ధ నేరస్తుడిగా పుతిన్‌ని అరెస్ట్ చేసినా లేదా చంపిన సైనికులు, అధికారులకు వన్ మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు తమ దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు సంఘీభావం ప్రకటించాడు కొనానిఖిన్.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొనానిఖిన్ 1992లో రష్యాను వీడాడు. ఆ తర్వాత 1999 నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు. అప్పటి నుంచి అక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు ఇబ్బందులు ఎదురైనా అతను యూఎస్‌లోనే తలదాచుకుంటున్నాడు
చదవండి: పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు
Comments
Please login to add a commentAdd a comment