ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో దిగ్గజ సంస్థలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై చేస్తున్న దాడుల్లో రష్యాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టెక్ దిగ్గజాలకు వార్నింగ్ ఇచ్చింది. గీత దాటితే సదరు సంస్థలకు చెందిన కార్పొరేట్ సంస్థల ఆస్థులతో పాటు ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తుంది.
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న వికృత క్రీడను ఆపాలంటూ టెక్ దిగ్గజాలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యురేపియన్ యూనియన్ దేశాలతో పాటు 50కి పైగా టెక్ కంపెనీలు తమ సర్వీసులను రష్యాలో యుద్ధ ప్రాతిపదికన నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం యురేపియన్ యూనియన్ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఇప్పటికే అనేక కంపెనీలను రష్యా ప్రభుత్వం బెదిరించినట్లు తెలుస్తోంది. మెక్‌డొనాల్డ్స్, ఐబీఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్, యమ్ కార్ప్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, సీఈఓ లాంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేస్తామని సూచించింది. దీంతో పలు కంపెనీలు రష్యా నుంచి ఉన్నతస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌లను బదిలీ చేస్తున్నాయి. తాజాగా రష్యాలో తమ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు, కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. రష్యాలో పనిచేస్తున్న 62వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment